Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. వందనాలు చేతుమో దుహిమ దైవమా
మేలు క్రియలు చేయు నిన్నె కీర్తింతుమో
నీకే స్తోత్ర గీతం పాడుచు
కాలమంతా సేవచేతుమో ||2||
1. సకల జీవరాశి అభివృద్ధిగాంచగా
భువనసుంధములనే సృష్టించినావుగా
నిజములన్ని చాటే శుభవార్త వెలసెగా
జనుల శ్రమల తీర్ప జనియించినావుగా
పరమ జీవమార్గం చూపినావుగా
ప్రభువు కృపను కోరె మంచివరములొందగా
2. సాటిలేని ప్రేమబాట మాకు చూపగా
మనసు నిలిపి వేడగానే మమ్ము కావగా
స్నేహకరము చూపి మాకు మేలుచేయగా
కష్టములను మంచువోలె కరుగచేయగా
నిండు ప్రేమ హృదయం సంతసించగా
జీవమార్గం జగతిలో ప్రగతిగాంచగా