Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
llపల్లవిll
వందన మిదిగో చేకొను ప్రభువా
చేకొను మా వందనము
మా యొక్క వినతి యిదియే ప్రభువా
చేకొను మా వందనము.
1 వ చరణం..
మా యొక్క శ్రమ విశ్రాంతి స్వేచ్ఛ
మీ యొక్క మహిమను హెచ్చించు గాక
వెచ్చించెదము మీ సేవకై తనువూ మనస్సు
ప్రభువా! చేకొను మా వందనము. ll వందన ll
2 వ చరణం..
విశ్వ విధాత పితకు జయము జయము
జీవము నిచ్చు సుతున కు జయము
పవిత్రాత్మకు యుగయుగముల వరకు
ప్రభువా! చేకొను మా వందనము ll వందన ll