Type Here to Get Search Results !

వందనమిదియే మాత ( vandanamidiye matha Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


వందన మిదియే మాతా మేరిమాతా -

ఓ మా మాత వందన మిదియే మాత 


1. దేవుని తల్లివి దీనుల శరణివి 

దైవ రక్షణం మాకిచ్చితివి

అగణిత వరముల జగతికి నెల్ల - 

అందజేయు మాడెందములలరా ||వందన|| 


2. మా ప్రియ తల్లివి శ్రీసభ జననివి 

మానవాళిని బ్రోవగ నీవు

అద్భుత విధమున దర్శన మిచ్చుచు - 

అభయము నొసగుమా శుభగుణశాలి ||వందన|| 


3. మమతకు నిలయం నీహృది క్షేత్రము - 

మమ్ము ప్రేమతో గాచితి నీవు 

ప్రేమ మాతగా ప్రణతులు చేయు - 

పుత్రులమమ్మ శరణిడవమ్మా ||వందన|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section