Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
వరప్రసాద మాతా - మా వరాల తల్లీ
వరములొసగి మమ్ము
నీ దరికి చేర్చుమమ్మా
రక్షణ మార్గముకే ద్వారము నీవె
రక్షకుని ప్రియ మాతవు నీవే నీవే
అమ్మా.. వరప్రసాదమాతా
అమ్మా మా వరాల మాతా ||2||. ||వర||
1. పావన మరియా నిర్మల మాతా
పరమాత్మునికే మాతవు
ఇలలో మనుజులకూ
ఒసగబడిన ప్రియమాతవు
మా జీవిత పయనంలో
మా తోడై నిలువుమమ్మా ||2||
కష్టసుఖాలలో-ఆదరువై రావమ్మా
|అమ్మా.. వరప్రసాదమాతా
అమ్మా మా వరాల మాతా ||2||. ||వర||
2. కానాపల్లి యజమానునిపై
కరుణ చూపిన మాతవు
అక్కరలోమమ్ము-ఆదుకొనే ప్రియబంధువు
అమ్మా మరియమ్మా...
నీ కొమరుని వేడమ్మా ||2||
అమ్మా మా అమ్మా....
నీ దీవెనలీయుమమ్మా
అమ్మా.. వరప్రసాదమాతా
అమ్మా మా వరాల మాతా ||2||. ||వర||