Lyrics/Tune/Prod: Fr. Jeevanbabu P
Music: Naveen M
Album: యేసే నా ఆశ - 2
ప. విమలమా' నిర్మలమా నిష్కళంకోద్భవమా
వందనం వందనం వందనం
పితకు ప్రియకుమారివి
సుతునకు ప్రియజననివి
ఆత్మకు (సంభూతివి) మాకు ప్రియ మాతవు
వందనమమ్మా గురువుల రాణి
జేజేలు పాడెదము
దివినేలు రాణి దీవించుమమ్మా
ఈ దీన బిడ్డలను
1. నుసికాని కాలుతున్న పొదయే
నీ నిష్కళంక హృదయ చిహ్నము
మసికాని అగ్నిలోని బాలురే
నీ వాడిపోని కన్య చిహ్నము
నిర్మల హృదయం
నీ అపురూప సౌందర్యం
మలచుమా మార్చుమా
మాదు. హృదయం నీ పోలికగా ||వ||
2. సమస్త ప్రాణికోటి పోషకుని
నీ చనుబాలుతో పోషించినావు
దీవిభువియుపట్టని పుత్రుని
నీ చలువ హృదిలో పదిలపరచినావు
వర్ణింపసాధ్యమా - నీ మాతృప్రేమను ||2||
మలచుమా మార్చుమా
మాదు హృదయం నీ పోలికగా ||వ||