Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
సాకి: ఆది మధ్యాంత రహిత దేవా -
ఆనంద నిలయ శ్రీ యేసు దేవా
ఆదరణ కర్త పవిత్రాత్మ త్రియేక దేవా
నమస్తే... నమస్తే... నమో నమః స్తుతే
ప: గాగరీరి సాస దాద పాగ - రీరి సాస దాద పాప గారి
వరములు కురిసే వేళ వరపుత్రుని పూజకు వేళ
మన ప్రభు ఏసుని అర్పించ -
వందన హృదితో వడివడి రండి ||వరములు||
1. పాద రక్షలను పాపము విడిచి -
పవిత్ర స్థలమున నడిచెను మోషే ||2||
ఆ...ఆ...ఆ...ఆ...
వక్ర మార్గములు సక్రమమై -
మన వక్ర మార్గములు సక్రమమై
నూతన హృదితో సంస్తుతి పాడగా ||2|| ||వరములు||
2. కొండలు కోనలు గతించినా -
కలకాల ముండును ప్రభు ప్రేమ ||2|| పరలోక దూతాళి తోడ -
ఆ పరలోక దూతాళి తోడ
ప్రస్తుతి చేయగ పసిహృది తోడ ||2|| ||వరములు||