Lyrics: unknown
Tune: unknown
Music: Peter Ch
Album: యేసుని చూడాలని
సా: సర్వశక్తి ధాయక .....స్వాగతాంజలి
సర్వలోక రక్షకా..... ప్రేమాంజలి
సర్వశుభదాయకా... ఆత్మాంజలి
స్వాగతాంజలి, ప్రేమాంజలి, ఆత్మాంజలి
ప: వికసించిన మనస్సులతో చేరితిమి స్వామి
చిగురించిన ఆశలతో వేడుచుంటిమి
దేవా వేడుచుంటిమి ||2||
ఆదరించవా, దీవించవా ||2||
నీ పాద పూజకు మమ్ము సిద్దపరచవా ||2|| ||వి||
1. స్నేహంతో సఖ్యతతో వేచియుంటిమి
ఐక్యముతో ఆనందముతో చేరియుంటిమి ||2||
నీ ప్రేమతో ఆనురాగంతో
మాకు ఆభయమిచ్చితివి ||2||
నీ బలిపూజలో వరములు ఒసగవా ||2||
మాకు వరములు ఒసగవా ||వి||
2. భారముతో వేదనతో ఆలసియుం
వినయముతో విధేయతతో మలచియుంటిమి ||2||
నీ ప్రేమతో దరిచేర్చవా నీ కరముచాచి ||2||
నీ బలిపూజలో దీవించవా ||2||
మమ్ము దీవించవా ||2|| ||వి||