Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: సంగమం-2
ప. వర్షధారగ రావా నా యేసయ్యా
ఎండి పోయిన భూమి నేనయ్యా ||2||
1. ఈ నేలలో పంట లేదయా
నా మనసులో శాంతి లేదయ్యా
వర్షధారగ రావా నా యేసయ్యా
ఫలింప చేయుమా పరమేశ్వరా ||2|| ||వర్ష||
2. పాపములన్ని పరిహరించుమా
భయములెల్లా పారద్రోలుమా
యేసునాధుడా నా రక్షకా
నీదు కృపతో ఆదరించుమా ||2|| ||వర్ష||
3. మనో వ్యధలను గుణపరచుమా
తనువు గాయమెల్లా స్వస్థపరచుమా ||2||
యేసు నాధుడా పరమ వైద్యుడా
గాయములెల్లా స్వస్థపరచుమా ||2|| ||వర్ష||