Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
వాత్సల్య సంపూర్ణుడా అనురాగ పరిపూర్ణుడా
నీ ప్రజలను ప్రేమించినావు
ఆశ్రయదుర్గమై-అభిషేకతైలమై ||వాత్సల్య||
1. అంతరిక్ష ద్వారములను తెరచిన
పరలోక రాజా ||2||
సముద్రమును పాయలుగా చేసి
అత్తరికి నడిపించిన మహాదేవుడా ||2||
||వాత్సల్య||
2. సింహాల గుహలో నుండి
దానియేలును రక్షించినావు ||2||
అగ్నిగుండము నుండి నీ భక్తులను
కాపాడిన మహిమోన్నతుడా ||వాత్సల్య||
3. పగటివేళ మేఘస్తంభమై
రాత్రివేళ అగ్నిస్తంభమై ||2||
మన్నాతో పోషించి నీ ప్రజలకు బండ
నుండి నీళ్ళను రప్పించినావు ||2|| ||వాత్సల్య||