Type Here to Get Search Results !

వేకువనే నేలేచెదను ( vekuvane nilechedanu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: కరుణకు రూపం 


వేకువనే నేలేచెదను ప్రభునీ 

నామం స్మరించుటకు ||2||

తల్లి మరచిన మరువని దేవా ` 

తండ్రి విడచిన విడువని దేవా

ఏ రీతి వర్ణింతును నీ ప్రేమను ` 

ఏ విధముగ కీర్తింతును llవేకుll 


1 వ చరణం.. 

ఆ..... ఆ.... ఆ.... ఆ.....

సౌలును నీవు పౌలుగా మార్చి ` 

నిలిపితివయ్యా నీ సాక్షిగా

అర్హతలేని నిన్ను పిలిచి ` 

అద్భుత రీతిగ దీవించితివి

చాటెదనయ్య సత్యసువార్త ఆ........ ||2||

నా తుది శ్వాస ఆగే వరకు

నిరతము నీ మహిమ కొనియాడెద llవేకుll 


2 వ చరణం.. 

ఆ..... ఆ.... ఆ.... ఆ....

తెలుసుకున్నాను నా శ్రమతో ` 

నీ సిలువ విలువను నా పయనముతో

నీ వాక్య నీడలో నిరతము వసియింప

నింపుము నన్ను నీ శుద్ధాత్మతో

నీవులేని జీవితమెంతో శూన్యం ఆ.... ||2||

నీవున్న నా మది ఎంతో ఆనందం

నిరతము నీ మహిమ కొనియాడెద llవేకుll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section