Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
వేకువనే వెదకెదను నీ సన్నిధిన్ -
ప్రతినిత్యం చాటెదను నీ ప్రేమనిధిన్
అల్లెలూయ యేసురాజా -
అల్లెలూయ అల్లెలూయ ఆరాధనా
అల్లెలూయ అల్లెలూయ స్తుతి అర్పణ
1. నీ కౌగిలిలో పరిపూర్ణ నెమ్మది -
నీ చెక్కిలిలో అది మిళితమైనది
నీ లోగిలిలో సుఖ సంతోషమూ-
నీ వాకిలిలో ఆశీర్వాదమూ
2. నీ సన్నిధిలో ప్రభావమున్నది -
నీవే మాకు బలమైన పునాది
నా పెన్నిధివై నడుపుము దేవా-
నీ సన్నిధిలో నను నిలుపుము దేవా