Lyrics: Fr. Dusi Devaraj
Tune: Fr. D.V. Prasad
Music: Dattatreya
Album: జీవశృతి - 3
వెలిగించు నాలో నీ ప్రేమ దీపం
నడిపించు నన్ను నీ వెలుగులో
నీ దరిచేర్చు నీ ప్రేమతో ll వెలిగించుll
1 వ చరణం..
పాపాంధ కారాన పయనించు వేళ
పావన మార్గము మీరిపోయిన వేళ
నింగిలో శశివై వేకువ చుక్కవై
త్రోవను జూ పి నీ దరి జేర్చుllవెలిగించుll
2 వ చరణం..
విద్వేష జ్వాలలు ప్రజ్వరిల్లిన వేళ
అజ్ఞాన బ్రతుకున కృంగి పోయిన వేళ
ఎదలో శృతివై సుజ్ఞాన నిధివై
నాలోన పలికి నీలో కలుపు llవెలిగించుll