Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
వెలిగించుమయా - నా యేసయ్యా
నా జీవన దీపం నీవేనయ్యా ||2||
శరణం.. శరణం.. శరణం దేవా ||2|| llవెలిగించుll
1 వ చరణం..
నిను చూడలేని - ఈ కనులెందుకయ్యా
నిను కోరలేని - ఈ బ్రతుకెందుకయా
నిను చేరలేని - ఈ తనువెందుకయా
నాకున్న సకలం - నీకేనయ్యా ...
శరణం.. శరణం.. శరణం దేవా ||2|| llవెలిగించుll
2 వ చరణం..
ఆత్మాంధకారం - తొలగించుమయా
నీ జీవనవేదం - బోధించుమయా
పరిపూర్ణ స్వస్ధతను - నాకొసగుమయా
నీ చెంతచేర - వరమీయుమయా
శరణం.. శరణం.. శరణం దేవా ||2|| llవెలిగించుll