Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
విజయం మహిమ విజయం
క్రీస్తుదేవుని ఉత్ధాన విజయం
విజయం స్లీవ విజయం
సత్య దేవుని అఖండ విజయం
1 వ చరణం..
ఉరుములు మెరుపులు ఏకమైనవి
గిరులు తరులు సాక్ష్యమైనవి హల్లేలూయా
ధరణీతలమే దద్దరిల్లగా
కరుణామయుడే పైకి లేచెను విజయం
2 వ చరణం..
సైతాను సంకెళ్ళు త్రంచబడ్డవి
సమాధిరాయి దొర్లి పడ్డది హల్లేలూయా
దివ్యకాంతితో యేసులేచెను
స్వంత శక్తితో చావు గెలిచెను విజయం