Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. వివాహమన్నది పవిత్రమైనది.
ఘనుడైన దేవుడు ఏర్పరచినది ||2||
1. దేహములో సగ భాగముగా .
మనుగడలో సహచారిణిగా ||2||
నారిగా సహకారిగా
స్త్రీని నిర్మించినాడు దేవుడు ||వి||
2. ఒంటరిగా వుండరాదనీ.
జంటగా వుండమేలనీ ||2||
శిరస్సుగా నిలవాలని పురుషుని
నియమించినాడు దేవుడు ||వి||
3. దేవునికీ అతి ప్రియులుగా
ఫలములతో వృద్ధి పొందగ
వేరుగావున్నవారిని ఒకటిగా
ఇల చేసినాడు దేవుడు ||వి|| .