Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: unknown
ఆ....ఆ.....ఆ.....ఆ....ఆ....
ప: విలపించే హృదయం కన్నీరుమున్నీరుగా||2||
ద్వేషముతోను మోసముతోను||2||
నలిగిన హృదయమిది
సాసససస దసదరి సదపా
పాపపపప గపగని దపగా
గాగగగగ రిగరిమ గరిసద
దసపదసా రిసరిగా పదసదపా
1. ఉన్నోడినంటూ గర్వముతోను
నావారినందరిని కోల్పోతిని ||2||
సకలము నీవని గుర్తించితిని ||2||
వున్నదంతయు సమర్పించెద
కరుణామయదేవా
యేసయ్యా.. యేసయ్యా
. యేసయ్యా..మెస్సయ్యా.. ||2|| ||వి||
2. నా కంటిలో దూలం తీయక నేను
నా తోటి వారిలో వెదకితి నలుసున్ ||2||
నీ కృప నాకు చాలును తండ్రి ||2||
నిరతం నిన్ను నే స్మరియించెదను
కృప గల మా దేవా
యేసయ్యా... యేసయ్యా...
యేసయ్యా...నేస్సయ్యా.. ||2|| ||వి||