Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప: విలువైన ఐశ్వర్యం కనుగొంటిని నీలో దేవా కనుగొంటిని
ఒక్క క్షణం నీ సన్నిధిలో ఉండుట ఎంతో ఆనందదాయకమే
స్తుతి మహిమ, ఆరాధన, సదా నీకే ఆరాధన
1. జీవన నాడికి జీవము పోసిన జీవన దాత నీవే కదా
జీవన నావను తీరము చేర్చే జీవన నావిక నీవే కదా
2. ఎన్నో జీవరాసులు ఉండగ నన్ను నీ బిడ్డగా సృష్టించితివి
పాపములో పడిపోయిన నన్ను ప్రాణము నిచ్చి రక్షించితివి