Type Here to Get Search Results !

విరిసింది నీ పూలవనం ( virisindi nee pulavanam Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: మరియతల్లి 


ప. విరిసింది నీ పూల వనము 

హృదయాన వసియించు యేసా

మదిలోన ధ్యానింతు నిన్ను

పులకించె నా యాత్మ దేవా ||యే||8|| 


1. కనువిందు చేయు నీ దివ్య వదనం

ముదమార దర్శింతును 

కరుణామృతాన్ని చిలికించు హృదయం 

ప్రియమార స్మరియింతును 

మలిసంధ్య వరకు వసియించు స్వామి 

నీతోనే జీవింతును ||యే||8|| 


2. నా జీవితాంతం నీ మందిరాన

నివసింప వరమీయు యేసా 

నీ ప్రేమ వలనే జీవింతు 

రాజాకరుణించి దీవించుము 

మహిమాన్వితం నీ దివ్య సదనం 

నీలోనే జీవింతును


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section