Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
వినవా మనవి యేసయ్యా
ప్రభువా శరణం నీవయ్యా
మలినమూ నా గతం
పగిలెనూ జీవితం-చేసుకో నీ వశం
||వినవా||
1. లోక స్నేహమే కోరి దూరమైతిని
వీడిపోయి నీ దారి ఓడిపోతిని
విరిగిన మనసుతో నిన్ను చేరాను
చితికిన బ్రతుకులో బాగు కోరాను
నన్ను స్వీకరించి నీతో ఉండనీ యేసయ్యా
నా తండ్రి నీవేనయ్యా... -
||వినవా|| .
2. ఆశ ఏది కనరాక బేలనైతిని
బాధలింక పడలేక సోలిపోతిని
అలసిన కనులతో నిన్ను చూసాను
చెదరిన కలలతో కృంగిపోయాను
నన్ను సేదదీర్చి సంతోషించనీ
యేసయా ....నా దైవమూ నీవయ్యా ...
||వినవా||