Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. విందు విందు విందు విందు
విందు విందు పసందైన
ప్రభుని విందు ||2||
రండి రండి రండి రండి
రండి రండి ఆరగింప వేగరండి ||2||
1. సత్యము మార్గము జీవం యేసని
నిత్యము తోడుగా నుండు వాడని ||2||
విశ్వసింతుము...ప్రభుని చాటగ ||2||
తనదు రక్త మాంసములు...
మనకు పాన భోజ్యముగా
స్వేచ్ఛగా ఇచ్చిన ప్రభుని పొగడెదం ||వి||
2. పాపము బాపగ పరమేశుడు
పుడమిలో పుట్టెను ప్రభు యేసుగా ||2||
విశ్వసించిన మనకు మోక్షము ||2||
పరము నుండి పంపిన
నరుని ఆత్మభోజ్యముగా . ||2||
అందరం అందుకొని ఆరగింతుము ||వి||
3, సన్నిధి పెన్నిధి... సత్ప్రసాదము
సతతము కొలుతుము కోవెలలోన ||2||
మందసందులో ప్రభుని వేడుదాం ||2||
తలుపు తట్టి తెరచెడి పిలువగానే
పలికెడి యేసుని
స్వరమును ఆలకించుదాం ||వి|| .