Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
విందు విందు - విందు విందు
యేసు విందు - యేసు విందు
మరపురాని మధుర విందు
పొందు పొందు - పొందు పొందు
నీవు పొందు - నీవు పొందు
యేసుతోనే ఐక్యమొందు
మనసులోని మాలిన్యం బాపునూ ఈ విందు
మధురమైన మార్గమున నడుపునూ ఈ విందు
1. నిన్న నేడు రేపు నిరంతరం ఏకరీతిగా ఉండు దేవుడు
తన దేహముతో నిన్ను పోషించును -
నీ ఆత్మకు ఆనందము కలిగించును
ఆరగించుమా నీవు అతిశయించుమా -
ప్రభుని విందుతో నీవు తృప్తి పొందుమా
2. పాపశాప కూపములో కూలినన్ -
పదిల పరచును నిజ దేవుడు ||2||
తన రక్తముతో నిన్ను శుద్ది చేతురు -
తన రాజ్యములో నిన్ను చేర్చుకుందురు ||2||
సేవించుమా నీవు స్వేచ్ఛ పొందుమా-
ప్రభుని విందుతో నీవు తృప్తి పొందుమా ||2||