Type Here to Get Search Results !

విందులకు విందు ( vindulaku vindu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. విందులకు విందు 

దివ్యసత్ప్రసాదంబు పొందెదము రండి

మన ప్రభువు యేసున్ ||2|| 


1. జీవము నిచ్చెడి-దాతయె విందు 

కావగ నొచ్చెడి -కరుణుని విందు ||2|| 

రావలె కలుషము-బాపు నీ విందు

త్రోవను మనకును-చూపు నీ విందు 


2. గర్వము చంపెడి-ప్రేమయే విందు

సర్వము నేలెడి వాడే విందు ||2|| 

సర్వేశ్వరుని-కొమరుడై విందు 

సర్వంబును మనకిచ్చునీ విందు ||వి|| 


3. ప్రేమను పంచెడి - పావన విందు

కామము త్రుంచెడి కొమరుని విందు ||2|| 

మమతను పెంచును-మన ప్రభు విందు

సమతను చూపును చక్కని విందు 


4. నాధుని దేహమే- పాపుల విందు

మాధుర్యంబగు - మనకిది విందు ||2|| 

కాదనకుండను-కనుదము విందు

పాపము పోవును-పొందిన విందు 


5. అడుగుము అందును అమరుల విందు

వేదకుము దొరకును జీవపు విందు ||2|| 

తట్టెడు వారికి మోక్షమే విందు 

పట్టును విడువక పంచుకో విందు ||వి|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section