Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
విశ్వశోభితమైన ప్రభు దేహమును
పాప పరిహార క్రీస్తు రక్తమును
పానము చేయగ రండి దైవ జనమా...
ఆరగించగ రండి దైవజనమా...
ప॥ మధురం అతి మధురం ఈ విందు
మధురాతి మధురం ప్రభు విందు
సుమధురమైనది ఈ విందు - ఈ విందు
పరలోక భోజ్యం ప్రభుని విందు
ప్రభుని విందు
రమ్ము త్వరత్వరగా రమ్ము దైవజనమా
దైవ కుమారుని విందులో పాల్గొనగా
1. అద్భుతమైనది ఈ ఆహారం
అమృతమైనది ఈ పానం ||2||
సుమధుర వరవాహిని
జీవమిచ్చేటి ప్రభురుధిరం ||2||
జీవమిచ్చేటి ప్రభురుధిరం ||రమ్ము త్వర||
2. కరుణామయుని కడరాత్రి విందిది
కలతలు తీర్చే కల్వరి విందిది
దివ్య శరీరముగా పాపము
హరియించు ఔషధము ||2||
పాపము హరియించు ఔషధము
||రమ్ము త్వర||
3. ఆకలి తీర్చే ఈ విందు
అమరుని చెంతకు చేర్చే విందు ||2||
ఆలస్యము చేయక
ఆరగించుము ఈ క్రీస్తువిందు ||2||
ఆరగించుము ఈ క్రీస్తువిందు
||రమ్ము త్వర|| ||మధురం||