Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
సాకి : అ..........అ.........
పల్లవి:
వినిపించుము నీ మంజుల వాక్యాలను
పలికించుము నీ జీవన రాగాలను. ll 2ll
కనబరచుము నీ జ్ఞాన మార్గాలను. ll 2ll
నడిపించుము నీ మోక్ష పదమందును. ll 2ll llప్రభువాll
1 వ చరణం..
అలనాటి మొషేతో మాటాడిన రీతిని
నీ దాసుడెషయతో ప్రవచించిన వాక్కును ll 2ll
మాటాడుము ఈ దీనుల హృదయాలతో ll 2ll
అజ్ఞాన హృదయాలు ప్రభవింపగ. ll ప్రభువాll
2 వ చరణం..
కన్నతల్లి తనయునితో మాటాడిన రీతిని
కన్నతండ్రి తనయునితో భోదించిన రీతిని
భోదించుము నీ ప్రేమ సందేశము
మా పాప మార్గాలు సరియవ్వగ ll 2ll ll ప్రభువాll