Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
విన్నవించనా ప్రభూ నాదు కోరిక
చల్లనైన మనసుతోటి కీర్తించనా ||2||
నా గానము గాత్రము నీవేనుగా
నా సర్వము శ్వాసయు నీవేనుగా
నా మార్గము జీవము నీవేనుగా
నా తోడుగా నీడగా ఉన్నావుగా ||విన్న||
1. నీ దివ్య సన్నిధిలో సన్నుతించగా
నీ యాజకత్వములో పాలుపంచగా ||2||
పేరు పెట్టి పిలిచినావు నా దైవమా
ప్రేమతో నడిపినావు ప్రియ నేస్తమా ||2||
అభివందనం శుభవందనం ||2||
ప్రేమ వందనం-పాదాభివందనం ||2||
||నా గానము గాత్రము|| ||విన్న||
2. నీ దివ్య వాక్కును ప్రకటించగా
నీ ప్రేమ కిరణాలు వెదజల్లగా ||2||
ఆత్మశక్తి నిచ్చినావు నా దైవమా
ఆరాధ్య నీయుడా ప్రియ నేస్తమా ||2||
అభివందనం శుభవందనం ||2||
ప్రేమ వందనం-పాదాభివందనం ||2||
||నా గానము గాత్రము|| ||విన్న||