Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
వ్యాకుల మాత నీవే
శాంతి ప్రదాయి నీవే
శాంతి ప్రదాయి నీవే
1 వ చరణం..
అఖిలలోకమాత పావనరాణి
మాపైన దయచూపి కాపాడుతల్లి ||2||
వ్యాకులమాత ముక్తి ప్రదాయిని
పావన రాణి నిత్యకన్యకా
పాపులను పరమందు చేర్చుము తల్లి ||వ్యాకు||
2 వ చరణం..
భాదలు ఓర్చిన మాత మా దీనజనని
నిరతము ఈ భువిలో నీ కరుణను కురిపించి
వ్యాకులమాత ముక్తి ప్రదాయిని
పావనరాణి నిత్యకన్యకా
పాపులను పరమందు చేర్చుము తల్లి వ్యాకు ||వ్యాకు||