Song Lyrics in Telugu
యేసయ్యా నా యేసయ్యా ఎపుడయ్యా నీ రాకడ
రమ్ము రమ్ము యేసునాథ వేగమె రారమ్ము
ఆమేన్ ఆమేన్ హల్లెలూయ ఆమేన్ హల్లెలూయ
చూచుటకెన్నో వింతలున్నవి ఈ భువిలోన
చూడగా ఎందరో ఘనులున్నారు ఈ ధరలోన
ఏమి చూచిన ఎవరిని చూచిన ఫలమేమి
నా కన్నులారా నిన్ను చూడాలి యేసయ్యా ||రమ్ము||
నా రూపమే మారునంట నిన్ను చూచువేళ
నిన్ను పోలి ఉండెదనంట నీవు వచ్చు వేళ
అనంతమైన నీ రాజ్యమే నా స్వదేశమయ్యా
అందుండు సర్వ సంపదలన్నీ నా స్వంతమయ్యా ||రమ్ము||
అమూల్యమైన రత్నములతో అలంకరించబడి - గొర్రెపిల్ల దీపకాంతితో
ప్రకాశించుచున్న- అంధకారమే లేని ఆ దివ్యనగరమందు
అవధులు లేని ఆనందముతో నీతో నుండెదను ||రమ్ము||
Song Lyrics in English
Yesayya Naa Yesayya Epudayya Nee Raakada
Rammu Rammu Yesunatha Vegame Raarrammu
Ameen Ameen Halleluya Ameen Halleluya
ChoochutakennO Vintalunnavi Ee BhuvilOna
Choodaga Endaro Ghanulunnaru Ee DharalOna
Emi Choochina Evarini Choochina Phalamemi
Naa Kannularaa Ninnu Choodali Yesayya ||Rammu||
Naa Roopame Maarunanta Ninnu ChoochuvEla
Ninnu Poli Undedana NEEvu Vachcha Vela
Ananthamaiana Nee Raajyame Naa Swadeshamayya
Andundu Sarva Sampadallannee Naa Swanthamayya ||Rammu||
Amoolyamaiana Ratnamulatho Alankarinchabadi - Gorrepilla Deepakanthitho
Prakaashinchuchunna - Andhakarame Leni Aa Divyanagaramandu
Avadhulu Leni Anandamuto Neetho Nundedanu ||Rammu||